ASR: సిరిగిందలపాడులో 15 ఎకరాల ప్రభుత్వ భూమి తక్కువ ధరకే ప్రైవేటు వారికి కేటాయించడంపై ఆదివాసి గిరిజన సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామసభ అనుమతి లేకుండా భూమి బదిలీ జరగడం పిసా చట్టం 1996కు విరుద్ధమని పేర్కొంది. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. సంబంధిత జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.