తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి అవిలాల పంచాయతీ సుబ్బయ్య కాలనీలో పాపాయమ్మ (80) హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఒంటరిగా జీవిస్తున్న ఆమెను తువాలుతో గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న డబ్బులు కోసమే ఈ హత్య జరిగినట్లు సమాచారం.