ధనుష్ హీరోగా దర్శకుడు విఘ్నేష్ రాజా రూపొందిస్తున్న ‘కర’ మూవీపై ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం ముందుగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను హీరోగా అనుకున్నారని ప్రచారం జరగగా, దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఆయనను తీసుకోవాలన్నది నిజమే అని చెప్పాడు. కానీ పృథ్వీరాజ్‌ను హీరో పాత్ర కోసం కాకుండా, కథలోని ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు ఆయన స్పష్టం చేశాడు.