NZB: అక్షయ తృతీయను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని ఆలూరు మండలం గంగరమందలో లలితా దేవి చక్రపీఠ అమరావతి ఆలయం వద్ద భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో 108 అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఓఆర్ఎస్ ద్రావణం అలాగే మందులు అందుబాటులో ఉంచామన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడిన అందుబాటులో ఉంటామని ఈఎంటీ శాంత, పైలట్ నాగేంద్ర తెలిపారు.