ATP: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స విజయవంతం కావడం పట్ల ఎమ్మెల్యే పరిటాల సునీత సంతోషం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. పవన్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ సామాజిక మాధ్యమాల నుంచి ఈ సందేశాన్ని పంచుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.