MNCL: కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 22వ తేదీ నుంచి తలపెట్టిన ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పిలుపునిచ్చారు. ఆదివారం మంచిర్యాల బస్ డిపో ఆవరణలో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, 2021, 2025 జీతభత్యాలు సవరించాలని, కండక్టర్, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.