HYD కోర్ అర్బన్ రీజియన్ నుంచి ORR వరకు అండర్ గ్రౌండ్ లెవెల్స్ కచ్చితంగా తెలుసుకోవడం కోసం భూగర్భ జిల్లా శాఖ ఫోకస్ పెట్టినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 57 పీజో మెట్రిక్ మీటర్లు అందుబాటులో ఉండగా, 30 చదరపు కిలోమీటర్లకు ఒక పీజో మీటర్ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు భూగర్భజల మట్టాలు తెలుసుకునే అవకాశం ఉండనుంది.