NRML: భారత సైన్యంలో సేవ చేసినందుకు భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలో అగ్ని వీర్ అగ్నిపత్ ఉద్యోగుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడల యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం అగ్నిపథ్ పథకంలో భాగంగా భారత సైనిక విభాగంలో అగ్నివీర్‌గా చేరుటకు పురుష అభ్యర్థుల నుంచి 2027 సంవత్సరానికి గాను దరఖాస్తులను కోరుతున్నారు.