KNR: కరీంనగర్ ఫిలిం భవన్లో జరిగిన తెలుగు వెలుగు జాతీయ ఉగాది సాహితీ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ఇల్లందకుంట ZPHS పాఠశాల తెలుగు ఉపాధ్యా యుడు సీహెచ్. వేణుకు ప్రతిష్ఠాత్మక ఉగాది పురస్కారం అందించారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో విద్యా రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రతినిధులు ఆయనను అభినందించారు.