TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం విచ్చేశారు. వీరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక రాహు కేతు పూజ చేయించుకున్నారు. పూజ అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం వీరికి దక్షిణామూర్తి సన్నిధి వద్ద స్వామి, అమ్మ వార్ల చిత్రపటాన్ని అందజేశారు.