PDPL: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.