MDK: రామాయంపేట మండల కేంద్రంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు తహసీల్దార్ రజనీకుమారి ఆదేశాల మేరకు ఆదివారం రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మండలంలోని పలు ప్రాంతాల్లో ఇసుక పెట్రోలింగ్‌ను నిర్వహిస్తూ నిఘా ఉంచారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.