కోనసీమ: తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన స్వామివారి రథోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.