ASR: ఐపీఎల్ మ్యాచ్లలో జిల్లాలో ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అమిత్ బర్దార్ ఆదివారం తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో భవిష్యత్తును ప్రమాదంలో పెట్టొద్దని హితవు పలికారు. యువత ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. జిల్లాలో బెట్టింగ్ నియంత్రణకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.