NRPT: నర్వ గ్రామ పంచాయతీ పరిధిలోని తైబజార్ హక్కుల వేలాన్ని ఈనెల 31న మంగళవారం ఉదయం 10:00 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు గ్రామ పంచాయతీ అధికారులు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు తప్పనిసరిగా రూ.5,000/- టోకెన్ అమౌంట్ను ముందుగా చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.