ATP: తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాప్తాడులో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 44 కేజీల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పార్టీ కోసం 1983 నుంచి పనిచేస్తున్న 40 మంది సీనియర్ నాయకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.