MIతో జరుగుతున్న మ్యాచ్‌లో KKR ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కేవలం 3.5 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్‌ను దాటేశారు. ఓపెనర్ ఫిన్ అలెన్ 14 బంతుల్లో 32 పరుగులు చేయగా, కెప్టెన్ రహానే 12 బంతుల్లో 26 పరుగులతో మెరుపులు మెరిపిస్తున్నారు. ముఖ్యంగా పాండ్యా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఈ జోడీ 2 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 26 పరుగులు సాధించడం విశేషం.