2026 టీ20 ప్రపంచకప్ బ్లాక్ టికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసులో ముంబైకి చెందిన మాజీ అండర్-19 క్రికెటర్ బల్వంత్ సింగ్ స్వరూప్ సింగ్ సోధాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 2,500 టికెట్‌ను ఏకంగా రూ. 25,000కు విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు సోధాను కోర్టులో హాజరుపరచగా, అతనికి బెయిల్ మంజూరైంది.