BPT: రేపల్లె ఎంసీఏ కమ్యూనిటీ హాల్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. నేతలు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.