BDK: భద్రాచలం తహశీల్దార్ కార్యాలయంలో రేపు ఉదయం 10:30 గంటల నుంచి ‘ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల మండల అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.