TG: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై CM రేవంత్ సమీక్షించారు. 2027 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. టెక్నికల్ ఇంజినీర్ల కమిటీ ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కమిటీ పర్యటించి.. పూర్తి నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలన్నారు. సబ్ కమిటీ ఆమోదం తర్వాత కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేయాలన్నారు.