GNTR: పొన్నూరు మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం పొన్నూరు నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించబడిన ఈ పార్టీ బడుగు బలహీన వర్గాలకు గుర్తింపు తీసుకువచ్చిందన్నారు.