AP: ఎప్పుడూ నవ్వుతూ ఉండే TDP రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అజాత శత్రువు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే ఆయన బంపర్ మెజారిటీతో గెలిచారన్నారు. రాజకీయాల్లో పనిచేయడంతోపాటు ప్రవర్తన కూడా ముఖ్యమని, నాయకులు అందరికీ ఆదర్శంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి అంశంలో నాయకులు TDP బ్రాండ్, గౌరవం పెరిగేలా ప్రవర్తిస్తే.. వారి హోదా పెరిగేలా పార్టీ చూస్తుందని హామీ ఇచ్చారు.