వరంగల్ జిల్లా పరిధిలోని పలు బస్టాండ్ కేంద్రాలలో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు తాగునీటి కోసం బయటకు వెళ్లి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ కేంద్రాలలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు.