CTR: ప్రభుత్వం చేపట్టిన ‘జీరో పావర్టీ- పీ4’ పై రేపు నియోజవర్గ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు MPDO అప్పాజీ ఆదివారం తెలిపారు. పుంగనూరు మండల కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. నియోజకవర్గంలోని అధికారులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చేపట్టే కార్యక్రమాలపై వివరించడం జరుగుతుందని తెలిపారు.