JN: LPG గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై దూదిమెట్ల నరేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఓటీపీలు, బ్యాంక్ పిన్ నంబర్లు వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు.