MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షుడు తాళ్లూరి లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు గారాపు రమేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.