RCB చేతిలో ఓటమిపై SRH కోచ్ డానియల్ వెటోరి స్పందించాడు. బౌలర్ల వైఫల్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని ఆయన అంగీకరించాడు. RCB బౌలర్ జాకబ్ డఫీ కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. అయితే, తమ జట్టులో ఏ బౌలర్ కూడా ఆ స్థాయిలో రాణించలేకపోయారని వెటోరి పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్ల్లో ఈ లోపాలను సరిదిద్దుకుని మెరుగైన ప్రదర్శన చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.