VZM: కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇంఛార్జ్, హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన బడ్జెట్ ఔట్ రీచ్ సమీక్ష, జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.