NGKL: అచ్చంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఆదివారం జరిగిన వేలంలో మార్కెట్‌గా అత్యధికంగా 1886.75 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. నాణ్యతను బట్టి క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.8,629 పలకగా, కనిష్ఠ ధర రూ.5,000గా నమోదైంది. మెజారిటీ రైతులు క్వింటాలుకు రూ.7,709 (మోడల్ ధర) చొప్పున విక్రయాలు జరిపారు. మినుములకు గరిష్ఠంగా రూ.8,226 ధర లభించింది.