KDP: లింగాల మండలం పెద్దకుడాల గ్రామంలోని అరటి తోటలో పేకాట ఆడుతున్న వారిపై రూరల్ సీఐ సీతారాంరెడ్డి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకుని, రూ. 27,830 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది మోటార్ సైకిళ్లను వదిలి పారిపోయినట్లు సీఐ తెలిపారు. పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.