సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో ప్రియదర్శి హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఓ నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, తాజాగా ప్రియదర్శి హీరోగా నటించిన ‘సుయోధన’ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.