BHPL: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తున్న క్రీడ పోటీల్లో భాగంగా ఎమ్మెల్యే గండ్ర షటిల్ ఆడి సందడి చేశారు. క్రీడారంగ బలోపేతానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులు, యువత చదువుతోపాటు క్రీడల్లో సమానంగా రాణించాలన్నారు.