PDPL: విక్టరీ షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ జ్యోతి నగర్లో నిర్వహించిన కరాటే పోటీలు ఆకట్టుకున్నాయి. రామగుండం, గోదావరిఖని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 160 మంది విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. విజేతలకు రంగు మల్లికార్జున్ గౌడ్, కార్పొరేటర్లు అసిఫ్ పాషా, విజయ మల్లేశ్, మమతా కుమారస్వామి బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు.