WGL: గ్రేటర్ వరంగల్ 1వ డివిజన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతులకు రుణమాఫీ అమలు చేయాలని, యాసంగి పంటకు అవసరమైన నీటిని అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.