AP: పల్నాడు జిల్లా మునుగోడులో ఏర్పాటు చేసిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ జెండా ఎగరవేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. 2019-24 మధ్య అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. 2029 ఎన్నికల్లో సమిష్టి కృషితో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.