VZM: ఇరాన్‌పై అమెరికా సామ్రాజ్యవాద యుద్ధం ఆపాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. అమెరికా తమ ఆయుధ వ్యాపారాన్ని అభివృద్ధికే యుద్దం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.