ASR: అపరిశుభ్రంగా ఉన్నా వాగు ఊటనీరు త్రాగుతున్నట్లు అరకులోయ మండలం సిరగం పంచాయతీ వర్ర తోకవలస గ్రామస్తులు తెలిపారు. కుళాయి నీరు ఆగిపోవడంతో 20 మీటర్ల లోయలో ఉన్న ఊట నీటిని కి.మీ దూరంలో ఉన్న గ్రామానికి తెచ్చుకుంటున్నామని మహిళలు వాపోయారు. నీరు తెచ్చేటప్పుడు పొరపాటున మహిళలు జారీపోతారేమోనని భయం వేస్తుందని పెసా కార్యదర్శి వంతాల బుద్దు తెలిపారు.