నార్త్ అమెరికాలో ‘బాహుబలి 2′($20.78M) పేరిట 9 ఏళ్లుగా ఉన్న రికార్డును ‘ధురంధర్ 2’ తిరగరాసింది. $21 మిలియన్లకుపైగా వసూళ్లతో అత్యధిక గ్రాస్ సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. దీనిపై ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. మూవీ నచ్చిందని, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడం సంతోషంగా ఉందన్నాడు. ఈ మూవీ కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹1,226 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.