KDP: బద్వేలు పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఓ ఆటో అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం ఒకవైపు ఒరిగిపోగా, ఆటో ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.