ములుగు పట్టణంలోని కలెక్టరేట్లో ఈవీఎం గోదాంను కలెక్టర్ దివాకర టీఎస్ నెలవారీగా తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీల్, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, రిజిస్టర్లు, పోలీస్ బందోబస్తును కూడా తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈవీఎంల భద్రతకు పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని తెలిపారు.