SRD: సిర్గాపూర్ మండలం వాసర్ శివారులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన సముదాయ నిర్మాణం పనులు షురూ అయ్యాయి. స్థానిక 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మించనున్నారు. రెండేళ్లలోపు పూర్తి నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇది పూర్తయితే 2560 మంది విద్యార్థులు 5 నుంచి ఇంటర్ వరకు చదువుకోనున్నారు. ఈ పాఠశాలో 120 మంది టీచర్లు బోధిస్తారు.