E.G: పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలో TDP 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిడదవోలు ITDP అధ్యక్షులు అబ్బిశెట్టి సత్తిరాజు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకులు NTR విగ్రహానికి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. CMగా NTR అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల పెన్నిధిగా నిలిచారన్నారు.