CTR: పుంగనూరులో ఈనెల 31న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ బస్టాండ్, పుంగమ్మ చెరువు ట్యాంక్ వద్ద గల పబ్లిక్ యూరీనల్స్, మున్సిపల్ ప్రైవేట్ బస్టాండ్ వద్ద గల ఖాళీ స్థలాలు, ఖాళీగా ఉన్న జనరల్ షాపు రూములు, ఖాళీగా ఉన్న ఐడీఎస్ఎంటీ షాపు రూములకు వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.