MHBD: మరిపెడ మున్సిపాలిటీలో సోమవారం మున్సిపల్ వార్షిక బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విజయనాంద్ తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మున్సిపల్ ఛైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు హాజరు కావాలని ఆయన కోరారు.