ASF: లింగాపూర్ మండలంలో LPG గ్యాస్ సరఫరా సమృద్ధిగా ఉందని, ప్రజలు అపోహలు నమ్మవద్దని SI గంగన్న కోరారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయించే వారిపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు