TDP 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ శ్రేణులకు జనసేన అధినేత, Dy.CM పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంలో రాజకీయ సంచలనం సృష్టించిన TDP.. 4 దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో బలంగా నిలబడింది. ఎన్నో ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులను తన అపార రాజకీయ అనుభవంతో పార్టీ సుప్రిమో చంద్రబాబు అధిగమించి.. TDP శ్రేణుల్లో స్థైర్యం నింపారు’ అంటూ ట్వీట్ చేశారు.