JN: నర్మెట్ట మండల కేంద్రంలో విన్సెంట్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం 12మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అదే విధంగా 50మంది ఒంటరి మహిళలు, వృద్ధులకు నిత్యవసర సరుకులు అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలన్నదే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నపు రెడ్డి, దినేష్ రెడ్డి, కేకే రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.