NRPT: అక్రమంగా మొరం మట్టి తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని పట్టుకున్నట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ SI గాయత్రి తెలిపారు. ధన్వాడ మండలం చర్లపల్లికి చెందిన మహేందర్ ఎలాంటి అనుమతులు లేకుండా మొరం మట్టిని తీసుకెళ్తుండగా నారాయణపేట మండలం అప్పక్‌పల్లి వద్ద పట్టుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.