TPT: నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలో సీఎం N. చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ నిన్న పరిశీలించారు. టిడ్కో గృహాల ప్రారంభోత్సవం నేపథ్యంలో భద్రత, హెలిప్యాడ్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.